స్టాక్ మార్కెట్ ముచ్చట్లు 14-05-26

ఈ వారం మార్కెట్:

IPO : గోల్డ్ లైన్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్: ఇదివరకే మార్కెట్లో ఉండడం వల్ల అప్లై చేయవచ్చు.

రాబోయే మార్కెట్:

పరాయి దేశాల సంపదలను కొల్లగొట్టి తన ఖాతాలో వేసుకునేందుకు అమెరికా మొండితనం, , ఇరాన్ స్వతంత్ర కాంక్షల వల్ల మార్కెట్ తీవ్రంగా ఒడిదుడుకులకు లోనయ్యే ప్రమాదం ఉంది.

జాగ్రత్తలు

●ధరలు పెరుగుతాయి, లేదా బ్లాక్ మార్కెట్ పరిస్థితులు (కృత్రిమ కొరత) వస్తాయి.

●కనీసం 2, 3 నెలల అవసరమయ్యే వంటింటి సరకులు, మందులు, ఇతర నిత్యావసరాలను తెచ్చుకోవాలి.

●ఆర్థిక క్రమశిక్షణను పాటించాలి. అనవసర కొనుగోళ్లు చేయవద్దు.

●మన కోరికలు ముడు రకాలని ఆర్థిక శాస్త్రం చెపుతుంది. అవి. 1) అవసరాలు, 2) సౌకర్యాలు, 3) విలాసాలు .

ఒక్కొక్క వ్యక్తిని బట్టి, అవసరాన్ని బట్టి, సందర్భాన్నిజట్టి, కాలాన్నిబట్టి, ఇలా ఒక విషయమే పై 3 రకాలుగా మారుతుంది.

ఉదా.: ఒక రాపిడో డ్రైవర్ కు ఒక వాహనం కొనడం అవసరం. దానితో వ్యాపారం చేస్తాడు కనుక, రోజు డబ్బు సంపాదిస్తాడు.

●వాయిదా వేయగలిగినవి ఏవైనా వుంటే, వీలైనంత కాలం వరకు వాయిదా వేయాలి.

●ఎప్పుడు ఏ అవసరం (ముఖ్యంగా ఆరోగ్యం) వస్తుందో తెలియదు. కావున అత్యవసర పరిస్థితుల కొరకు సరైనంత మొత్తం చేతిలో డబ్బు ఉంచుకోవాలి. విత్ డ్రాయల్ పరిమితులు విధించవచ్చు.

ఇంకా ఏమైనా జ్ఞాపకం వస్తే పెడతాను.
-వెల్ముల కృష్ణారావు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments