ద్రవ్యోల్బణం మరియు మీ కొనుగోలు శక్తి (Inflation & Purchasing Power)
ముందుగా ద్రవ్యోల్బణం మరియు మీ కొనుగోలు శక్తి అంటే ఏమిటో చూద్దాం.
ద్రవ్యోల్బణం (Inflation) అనేది కరెన్సీ విలువ తగ్గింపు/ తగ్గడం వల్ల వస్తువులు మరియు సేవల ధరలలో దీర్ఘకాలిక పెరుగుదల.
కొనుగోలు శక్తి : ఉత్పత్తులు మరియు సేవలను కొనుగోలు చేసే ఆర్థిక సామర్థ్యం. వినియోగదారుల ధరల సూచీ (Consumer Price Index లేదా CPI) దీనికి ఉపయోగపడుతుంది.
ద్రవ్యోల్బణం (Inflation) మీ పెట్టుబడుల లాభాలను ఎలా తగ్గిస్తుందో ఇక్కడ అర్థం చేసుకోండి.
ఉదాహరణకు, మీరు 5 ఏళ్ల కింద ఒక లక్ష పెట్టి కొన్నదానిని, తర్వాత ₹2.5 లక్షలు వస్తుందని లెక్కలేస్తే, అప్పటి ₹2.5 లక్షల విలువ ఇప్పటి ₹1.8 లక్షలతో సమానం. అనగా, మీరు ఇదివరకు కొన్న ఆస్తిని ఇప్పుడు అమ్మగా దానిపై అదనంగా / లాభం వచ్చినదాని అనుకుంటాం. లేదా మనకు బ్యాంకులో వేసిన Fixed Deposit పై వచ్చిన అసలు + వడ్డీ మొత్తంతో మనకు పెరిగినట్లు అనిపించినా, నిజానికి ఇక్కడ మనకు నికర విలువ తగ్గినదనేది చేదు వాస్తవం. (ఇది 6% ద్రవ్యోల్బణం కు సమానం).
అధికారిక గణాంకాల కోసం MOSPI వెబ్‌సైట్ ↗ చూడండి.
ద్రవ్యోల్బణం కాలిక్యులేటర్ లేదా వివరణాత్మక FAQలు
ద్రవ్యోల్బణం (Inflation) మీ పెట్టుబడిని ఎలా ప్రభావితం చేస్తుందనేదానిని తెలుసుకోవటానికి ద్రవ్యోల్బణం కాలిక్యులేటర్ కు వెళ్ళండి.ఇందులో మీకు రెండు options (Button) ఉన్నాయి.
1) Lumpsum (ఒకేసారి పెట్టుబడి పెట్టడం)
2) Monthly Sip (నెలవారీ చిట్టీలలాగా కట్టడం)
ఈ రెంటిలో మీకు నచ్చిన button నొక్కండి.
ద్రవ్యోల్బణం (Inflation), Consumer Price Indices (CPI) వంటి విషయాలను వివరణాత్మకంగా తెలుసుకోవటానికి FAQ పేజీకి వెళ్ళండి.
అయితే, ఈ పోస్ట్ లోని కోడ్ Execute అయి, పోస్ట్ లోడ్ కావడానికి కొన్ని నిమిషాల సమయం పడుతుంది. పోస్ట్ ఓపెన్ కావటం లేదని కంగారూ పడకండి. ఒక నిమిషం పట్టవచ్చు- డా. వెల్ముల కృష్ణారావు.
First Posted: 06-05-2026 7:28 AM
Last Updated : 14-05-2026 2.26pm
