పొదుపు సూత్రము- మదుపు పాఠము

జీవితంలో చేసే అనాలోచిత/ అనవసర ఖర్చులతో ఒకరిద్దరిని పోషించవచ్చునని ఎక్కడో చదివిన జ్ఞాపకం. ఆడంబరాలకు, అవసరం కన్నా ఎక్కువగా అనగా డాంబికాలకు చేసే ఖర్చులు కూడా ఇందులో చేర్చవచ్చు. పక్కవారిని చూసి, గొప్పలకు పోయి తాహతుకు మించి, అప్పులను చేసి, ఖర్చుపెట్టడమన్నమాట.

అన్నివెంట్రుకలున్న సిగ ఎటు ముడిచినా అందమే” అని సామెత. ఆర్థిక స్తోమతలున్నవారు ఎలా చేసినా సరే. కాని అప్పులుచేసి, బర్త్ డేలు, ఇంకా సంవత్సరములోపు చిన్నపిల్లలకు నెలవారీ బర్త్ డేలు .. చెవులదిరిపోయే చప్పుల్లతో బరాత్ లు …. ఉత్పాదకత లేని, అప్పులు చేసి ఇవన్నీ ఎందుకో ఎవరికీ అర్థం కాదు. కానీ, ఒకరిని చూసి మరొకరు…

ఈ మధ్య ఈ పెడ ధోరణి మరింత పెరిగింది. ఒకప్పుడు రజస్వల అయితే, 40-50 ఏళ్ల కింద, ఇంటిమగపెద్దకు కూడా చెప్పేవారు కాదు. ఆడవారికి మాత్రమే చెవిలో చెప్పి, వెళ్లేవారు. ఇప్పుడు ఆహ్వాన పత్రికలు, ఫ్లెక్సీలు ! ఇటువంటి సందర్భాల్లో ఇంటిపైన ఒక ఎర్రగుడ్డ కట్టేవారని చదివిన జ్ఞాపకం. (“పెళ్లి-దాని పుట్టుపూర్వోత్తరాలు“లో తాపీ ధర్మారావు గారు?) అప్పటికిప్పటికి, మనం ఎంత ఎదిగిపోయాం. రవాణా, సమాచార వ్యవస్థల వంటివి లేని ఆ రోజుల్లో అది అవసరమే. కాని, చీమ చిటుక్కుమన్నా, ప్రపంచం నలుమూలలా పాకే అనేక రకాల (మెయిల్, కొరియర్, అక్కడో ఇక్కడో ఇంకా మిగిలివున్న పోస్టల్) వ్యవస్థలు, సామాజిక మాధ్యమాలు, ఫోన్, టెలిప్రింటర్, ఫాక్స్… ఈ రోజుల్లో, ప్రచారానికే ఇంత ఖర్చులవసరమా

సరే. మా డబ్బులను మేము ఖర్చు పెట్టుకుంటే, ఈ సోది ఎందుకనే ప్రశ్న రావచ్చు.

  • FDలపై వచ్చే వడ్డీ
  • మీరు పెట్టిన పెట్టుబడులపై వచ్చే లాభం
  • బాంకులలో దాచిన ధనం

ఇలాటివన్నీ కాలక్రమేణ నిల్వలు తరిగి, వాటి విలువలు కూడా తగ్గిపోతాయి. ,

నిల్వలు తగ్గడం సహజమే కానీ, వాటి విలువలు కూడా ఎలా తగ్గిపోతాయి ? అనే సందేహం మీకు రావచ్చు.

ఈ వివరాలు మీకు అర్థం కావాలంటే, 1) ద్రవ్యోల్బణం-మీకొనుగోలుశక్తి (Inflation-PurchasingPower) ని చదవండి. ద్రవ్యోల్బణం-మీకొనుగోలుశక్తి (Inflation-PurchasingPower) – stock-market-info.onomasts.com

ఆ తర్వాత ఇందులోని విషయాలను అంకెలలో కూడా పరీక్షించుకోవడానికి cagr-sip-inflation-calc-v3.3 అనే పేజీకి వెళ్ళండి. లేదా అందుకోసం ఈ లంకెపై నొక్కండి. cagr-sip-inflation-calc-v3.3 – stock-market-info.onomasts.com

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments